కుంభమేళాకు వెళ్తుండగా విషాదం
` ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం
` విూర్జాపుర్` ప్రయాగ్‌రాజ్ హైవేపై వెళ్తున్న బస్సును ఓ బొలెరో వాహనం
ప్రయాగ్‌రాజ్(జనంసాక్షి):యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విూర్జాపుర్` ప్రయాగ్‌రాజ్ హైవేపై వెళ్తున్న బస్సును ఓ బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మహాకుంభమేళాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాకు చెందిన పలువురు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు బొలెరో వాహనంలో వెళ్తున్నారు. ఈ జీపు మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌కు చెందిన భక్తులను తీసుకెళ్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. 19 మంది గాయపడ్డారు. మరణించినవారంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారుగా గుర్తించారు. అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను సవిూప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రమాదంపైగ్భ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఇక, ఇటీవల కుంభమేళాకు వెళ్లి తిరిగివస్తున్న కొందరు తెలుగు యాత్రికులు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్‌లోని నాచారం వాసులు మృతి చెందారు.