కుక్క కోసం మహిళపై దాడి

పెద్దపల్లి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):   కాంగ్రెస్‌ నాయకులు బరితెగిస్తున్నారు. గాంధీనగర్‌లో ఉండే పెద్దపల్లి కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి కట్కూరి సందీప్‌.. కేవలం పెంపుడు కుక్క కోసం పక్కింటి వారిపై అమానుషంగా దాడి చేశాడు. వారి కుక్క.. తమ ఇంట్లో బహిర్భూమికి వెలుతుందని చెప్పినందుకు మహిళలు అని కూడా చూడకుండా వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్‌ నేత దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నరు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నరు.