కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

మెదక్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): జిల్లాలోని చేగుంటలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంజయ్య(55), రామవ్వ(48) అనే దంపతులు  ఇంట్లో ఉరివేసుకునిఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతోనే దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.