కుటుంబ పాలనతో రాష్ట్రం అధోగతి

కేంద్రనిధులు పక్కదారి పట్టించింన కెసిఆర్‌
రాజ్యసభ సభయుడు లక్ష్మణ్‌ విమర్శలు

హైదరాబాద్‌,జూలై14(జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వ నిధులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందన్నారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి తాను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాజ్యసభలో తెలంగాణ గొంతుకను వినిపిస్తానని అన్నారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఏర్పాటే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. ప్రధాని మోడీ ఆకాంక్ష అయిన డబుల్‌ ఇంజన్‌ సర్కారు రావడం ఖాయమన్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి పాలనపై సీఎం కేసీఆర్‌ వ్యంగంగా మాట్లాడుతున్నారంటూ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ మండిపడ్డారు. కుటుంబ పాలనకు తావు లేకుండా అర్హులందరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించే పాలన డబుల్‌ ఇంజన్‌ సర్కారుదే అన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష మేరకు పాలన సాగడం లేదని, కుటుంబ పాలన కొనసాగుతుందోని మండిపడ్డారు. ఏ కారణాలతో విభజన హావిూలు అమలు కాలేదో రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసన్నారు. విభజన హావిూల అమలుకు ప్రయత్నిస్తానని కూడా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. రాజ్యసభలో తెలంగాణ గొంతుకను వినిపిస్తానని స్పష్టం చేశారు. ఏ కారణాలతో విభజన హావిూలు అమలు కాలేదో రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కదారి పట్టిస్తోందని, టీఆర్‌ఎస్సర్కార్‌ అవినీతితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదోగతి పాలైందని విమర్శించారు. తాను తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. టీఆర్‌ఎస్‌లో అనేక మంది ఎమ్మెల్యేలు, నేతలు అయిష్టంగా కొనసాగుతున్నారని
లక్ష్మణ్‌ పేర్కొన్నారు.