కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్
జుక్కల్, జూలై29,జనంసాక్షి,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నాడని బిజెపి జాతీయ కార్యవర్గసభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయన శుక్రవారం ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం లోని
దోస్ పల్లి, బంగారుపల్లి, మయిబాపూర్, సిద్దాపూర్, గుండూర్, గుండూర్ తండా, జుక్కల్ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నీళ్లు,నిధులు,నియామకాలు నినాదంతో కేసీర్ గద్దెనెక్కాడని తెలిపారు. సీఎం ప్రజలకిచ్చిన హామీలు మరిచి కుటుంబాన్ని బాగుచేసుకుంటున్నాడని ఆరోపించారు. ఇంటింటికి నీళ్లు ఇస్తానని ,ఇవ్వక పోతే ఓట్లు అడగడానికి రానని ప్రకటించిన కేసీర్ తన ఫామ్ హౌస్ అవసరాలకు నీళ్లు తరలిస్తున్నాడని ఆరోపించారు.నిరుద్యోగ భృతి హామి మరిచిన కేసీఆర్ తన కొడుకుకు, కూతురుకు, అల్లుళ్లకు మాత్రం పదవులు ఇచ్చి లక్షలాది రూపాయలు జీతంగా తీసుకుంటున్నారని ఆరోపించారు.పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వని ముఖ్యమంత్రి కొడుకు కు,కూతురుకు, అల్లుళ్లకు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారని విమర్శించారు.దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ తానే గద్దెనెక్కి కూర్చున్నాడని విమర్శించారు. బంగారు తెలంగాణా చేస్తానన్న కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబంగా చేసుకున్నాడని అన్నారు. సిద్దిపేట, గజ్వేల్ ,సిరిసిల్ల నియోజక వర్గాలను మాత్రమే అభివృద్ధి చేసుకుని మిగితా నియోజకవర్గాలను పట్టించుకోలేదని విమర్శించారు. ఆర్టీసీ చార్జీలు,కరెంట్ బిల్లులుపెంచి సామాన్య ప్రజల నడ్డివిరిచారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.బిజెపి కార్యకర్తలు అధికసంఖ్యలో ప్రజాగోస బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.గ్రామాలలో బిజెపి పతాక ఆవిష్కరణ గావించారు.ప్రతిగ్రామంలో ప్రజలు బీజేపీ నాయకులకు బ్రహ్మరథం పట్టారు. తమగోడును నాయకులకు వివరించారు.ఈ కార్యక్రమంలోబిజెపి కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు ,మాజీ ఎమ్మెల్యే అరుణ తార, మాజీ జడ్పి చైర్మన్ వెంకటరమణారెడ్డి,
బిజెపి నాయకులు రాము,తేలు శ్రీనివాస్, శివాజీ రావ్ పాటిల్, కిష్టారెడ్డి, హన్మాండ్లు, వెంకట్ రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.