.కుడకుడలో మాజీమంత్రి ఆర్డీఆర్ పర్యటన

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు కుడకుడలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మంగళవారం వర్షంలోనే పర్యటించారు.వార్డులోని పలు వీధుల్లో తిరుగుతూ ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట స్థానిక వార్డ్ కౌన్సిలర్ వేములకొండ పద్మ  , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బైరు శైలేందర్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, కొండపల్లి సాగర్ రెడ్డి, వీరన్న నాయక్, సైదులు, సూర్యాపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి, నరేందర్ నాయుడు, కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.