కుమారస్వామికి ప్రధాని ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌

రాష్ట్రం ఫిట్‌నెసే నాకు ముఖ్యం
మోదీ ఫిట్‌నెస్‌ వీడియోపై కుమారస్వామి కామెంట్‌
బెంగళూరు, జూన్‌13(జ‌నం సాక్షి) : గత నెలలో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ విసిరిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌కు సోషల్‌ విూడియాలో అద్భుత స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. రాజ్యవర్ధన్‌ మొదట బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు ఛాలెంజ్‌ విసిరారు. దీనికి స్పందించిన విరాట్‌ కోహ్లీ జిమ్‌లో వార్మప్‌ చేసి ఆ వీడియోను పోస్ట్‌ చేస్తూ ప్రధాని మోదీని ట్యాగ్‌ చేస్తూ సవాల్‌ చేశారు. మూడు వారాల కిందట కోహ్లీ విసిరిన ఈ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, తాను వ్యాయామం చేస్తున్న ఓ వీడియోను బుధవారం ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అంతేకాదు, కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామికి తన ఫిట్‌నెస్‌ చూపాలని సవాల్‌ విసిరారు. ఆయనతో పాటు కామన్వెల్త్‌ పతక విజేత మోనికా బాత్రా, 40 ఏళ్ల వయసు దాటిన ఐపీఎస్‌ అధికారులనూ ఛాలెంజ్‌ చేశారు. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాలతో మమేకమైతే ఎంతో ప్రేరణ పొందవచ్చని, ఆపై ఉత్సాహంగా రోజు సాగుతుందని తాను పోస్ట్‌చేసిన వీడియోలో మోదీ వ్యాఖ్యానించారు. వీటికి యోగా తోడైతే జీవితాన్ని మరింత ఆనందంగా గడపవచ్చని పేర్కొన్నారు. కాగా ప్రధాని నరేంద్రమోదీ ఫిట్‌నెస్‌ వీడియోపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కామెంట్‌ చేశారు. ఫిట్‌నెస్‌ అనేది ముఖ్యమని, కానీ ప్రస్తుతం తన రాష్ట్ర ఫిట్‌నెస్సే నాకు ముఖ్యమని కామెంట్‌ చేశారు. డియర్‌ మోదీజీ..నా ఆరోగ్యం గురించి విూరు ఇంతగా ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు. శారీరక ఫిట్‌నెస్‌ ఎంతో ముఖ్యం. ఈ ఛాలెంజ్‌కు నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను. నా వర్క్‌ అవుట్‌లో భాగంగా యోగా, ట్రెడ్‌మిల్‌ రోజూ చేస్తుంటాను. కానీ నా రాష్ట్రం ఫిట్‌నెస్‌ను అభివృద్ధి చేయడం గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను. ఇందుకు విూ మద్దతు కావాలి. అని ట్వీట్‌ చేశారు.
నామినేట్‌ చేసినందుకు మోదీకి థ్యాంక్స్‌ – మానికా బాత్రా
ఇటీవల కేంద్ర క్రీడలశాఖా మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ ప్రారంభించిన ‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’కు విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేను సైతం అంటూ తన ఫిట్‌నెస్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. నరేంద్ర మోదీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌పై భారత టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మానికా బాత్రా స్పందించారు. ప్రధాని మోదీ స్థాయి వ్యక్తి తనకు ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ విసరడం చాలా సంతోషంగా ఉందన్నారు.  తనను గుర్తించి ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌కు నామినేట్‌ (ఆహ్వానించినందుకు) చేసినందుకు ప్రధానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. మోదీ చేసిన ఈ ప్రయత్నం అందరికీ ఉపయోగకరమైనదని పేర్కొన్నారు. క్రీడాకారులతో పాటు ఇతరలుకు కూడా ఫిట్‌నెస్‌ అనేది చాలా ముఖ్యమని మానికా అభిప్రాయపడ్డారు.
మహిళల టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌లో స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణి మానికా బత్రా. కామన్వెల్త్‌ చరిత్రలో టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత్‌ సాధించిన తొలి పతకం కావడం గమనార్హం. ఇటీవల ఆస్టేల్రియాలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో సింగపూర్‌ క్రీడాకారిణి మెయినగ్యు యూతో జరిగిన ¬రా¬రీ పోరులో మానికా 11-7, 11-6, 11-2, 11-7 పాయింట్ల తేడాతో నెగ్గి స్వర్ణం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
అతికొద్ది మందిలో మోదీ ఒకరు ా రాజ్యవర్థన్‌ రాథోడ్‌
తాను ప్రారంభించిన హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఫిట్‌నెస్‌ విడుదల చేయడంపై కేంద్ర క్రీడలశాఖా మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రధాని తరచుగా యువత ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడేవారు. యువత వల్ల దేశం మరింత అభివృద్ధి చెందుతుందని మోదీ భావించేవారు. ఇలాంటి ఫిట్‌నెస్‌ వీడియోలు షేర్‌ చేసే అతికొద్దిమంది ప్రధానులలో మోదీ ఒకరు. ఈ ప్రచారం మంచిధోరణిలో వెళ్తుంది. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని’  రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ వివరించారు.