కురవి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్దం చేసిన-టిఆర్ఎస్ శ్రేణులు
-మండల అధ్యక్షుడు తోట లాలయ్య
కురవి సెప్టెంబర్-27
కురవి మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర విభజన హామీలో ఉన్న బయ్యారం ఉక్కు కర్మాగారం ను తెలంగాణ లోని బయ్యారం ప్రాంతంలో నెలకొల్పేందుకు కేంద్రం నిరాకరించడం పట్ల కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు, ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆదేశానుసారం దగ్ధం చేయడం జరిగింది.విభజన హామీలను గాలికి వదిలేసి, తెలంగాణ ప్రాంతం నుండి సంపదను ఇతర వేరే రాష్ట్రాలకు తరలించడం దుర్మార్గం అని టిఆర్ఎస్ కురవి మండల అధ్యక్షుడు తోట లాలయ్య అన్నారు.కేంద్రం తెలంగాణ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అన్నారు. తెలంగాణ లో ఉన్న ఖనిజ సంపదను కుట్రతోటి కేంద్రం ఇతర రాష్ట్రాలకు దోచిపెట్టడం సిగ్గుచేటన్నారు. ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మించకపోవడం,సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ స్థాయిలో హోదా కల్పించకుండా కాలయాపన చేయడం నీతిమాలిన చర్య అని అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణ ను నష్టం చేసే పనులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ను,బీజేపీ నాయకులను గ్రామాల్లో నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ లో బీజేపీ మతకల్లోలాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే బీజేపీ కి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బాదావత్ రామునాయక్, టిఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోతు రవినాయక్,వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్య,మాజీ ఆలయ చైర్మన్ బాదావత్ రాజునాయక్,మాజీ వైస్ ఎంపీపీ పెద్ది, టిఆర్ఎస్ మండల నాయకులు బండి యతిరాజు,గాడిపల్లి రాములు,యూత్ మండల అధ్యక్షుడు బాణోత్ రమేష్, టిఆర్ఎస్ ముఖ్య నాయకులు బెడద వీరన్న,దేవేందర్ రెడ్డి,ఇరుగు వెంకన్న, దైద భద్రయ్య,బండారు రమేష్,దుడ్డేల వినోద్,కిన్నెర మల్లయ్య,దుబాకుల వెంకన్న,పిడమర్తి ఉపేందర్,వెంకట్యా నాయక్,ఇరుగు సత్యం,చంటి,బిచ్య,హాథిరామ్,వీ