కురుస్తున్న వర్షాలు … మురుస్తున్న రైతులు

కురుస్తున్న వర్షాలు ... మురుస్తున్న రైతులు

చిరుజల్లులతో   ఆనందం, సాగుకు సిద్ధమైన రైతన్నలుదొరకని విత్తనాలు, ఎరువులు, వెంటాడుతున్న కరువు భయం
నిరుడు కరువు విళయతాండవం చేసింది.ఆ చేదు జ్ఞాపకాలను రైతులు మరిచిపోయి అన్నదాత సాగుకు సిద్ధమవుతున్నడు… ఈ యేడైన కరువు ఛాయలు అలుముకోకుండా వర్షాలు సమృద్ధిగా కురవాలని వరణదేవున్ని ప్రారిస్తున్నాడు… నిరుటి విషాదా జ్ఞాపకాలు దరిచేరద్దని మేఘాల వైపు ఆశగా చూస్తున్నాడు. ఇక కౌలు రైతుల పరిస్థితి చెప్పలేం.ఓవైపు కౌలుధరలు, మరోవైపు పెరిగిన ఎరువుల ధరలు, విత్తనాలు దొరకకపోవడం  రైతులపై భారం తడిసి మోపడైంది.. ఇక ఆ కరవు చేదు జ్ఞాపకాలు రైతుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తున్నా… నమ్ముకున్న భూమే బువ్వ పెడుతుందని ఆశతో రైతన్న సాగు సిద్ధమవుతున్నాడు
.

పరకాల  జూన్‌ 19(జనంసాక్షి) :
పరకాలలో గత మూడు రోజులుగా వర్షాలు పడ డంతో రైతన్నలు ఆ నందం లో మునిగి పోయా రు.  విత్తనాల ను నాటుటకు భూ ములను చదునుచేసి దుక్కి దున్ని రైతులు సిద్దం గా ఉన్నారు. ఇప్పటికీ ఇంకా రైతు లకు విత్త నాలను అందించ లేక ప్రభుత్వం విఫలమైందని రైతులు విమర్శిస్తున్నారు. ఓ వైపు ఎరువుల ధర లు చుక్కలంటినయని ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రంగాం పట్టించుకుని సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ఇక మూడు రోజల నుంచి వర్షం కురుస్తుండడంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. ఈ వర్షాలు ఇలాగే కరువు చాయలు లేకుండా కురవాలని వరుణాదేవున్ని ప్రార్థిస్తున్నారు. ఇన్నాళ్లు ఎండలను చూసివర్షాలు పడవనే భయం రైతుల గుండెల్లో గుబులు ఉన్నా ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ మేఘాలు మూడు రోజు లు నుంచి  వర్షాలు కురవడంతో  రైతులు సాగు బాటపట్టారు.