కులవృత్తులకు పెద్దపీట వేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే

అభివృద్ధి అజెండాగా తెలంగాణ ముందుకు
మరోమారు టిఆర్‌ఎస్‌ను ఆదరించాలి: ఇంద్రకరణ్‌
నిర్మల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  గత పాలకులకు ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం లేదని  మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఓట్లతో అభివృద్ధిని ముడిపెట్టే అలవాటు తమకు లేదని  స్పష్టం చేశారు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చేతి వృత్తులు, కులవృత్తులను సీఎం కేసీఆర్‌ ప్రోత్సహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే రూ. 42 వేల కోట్లతో సంక్షేమాలు పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ కృషి వల్లే సాధ్యమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 లక్షల మంది గొల్లకురుమలను గుర్తించి, రూ.10 వేల కోట్ల విలువ చేసే గొర్రెలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మొదటి దశలో రూ.5 వేల కోట్ల విలువ చేసే గొర్ల యూనిట్లు అందజేసినట్లు తెలిపారు. రాజకీయలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలోని గొల్లకురుమలు సబ్సిడీ గొర్ల యూనిట్‌ అందుకుంటున్నా రన్నారు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి చెందాలనే ఉద్దేశంతో రూ. 42వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాష్ట్రంలో ముదిరాజులు, బెస్తలు వెనుకబడి ఉన్నారని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు. ముదిరాజు బెస్తల అభివృద్ధిలో భాగంగా సబ్సిడీ ద్విచక్రవాహనాలను అందిస్తున్నట్లుగా గుర్తు చేశారు. చేప పిల్లలను ఇవ్వడమే కాకుండా చేపలు అమ్ముకోవడానికి ద్విచక్రవాహనాలు అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పాడి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభు త్వం సబ్సిడీపైన గేదెలు అందిస్తుందన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్‌ కోసం సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో 119 గురుకులను ప్రారంభించినట్లు చెప్పారు. రాబోయే విద్యా సంవత్సరాల్లో 119 బీసీ గురుకులాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పుట్టిన బిడ్డ నుంచి..పండు ముసలి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేలా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఓటు వేసి గెలిపించాలని కోరారు.