కులవృత్తులకు పెద్దపీట వేసిన కెసిఆర్‌

అభివృద్ది టిఆర్‌ఎస్‌తోనే సాధ్యం: గొంగిడి సునీత

యాదాద్రి,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు అన్ని విధాల చేయూత నిస్తుందని, కులవృత్తుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే గొగిడి సునీత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ సమర్థవంతమైన పాలన అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. చేతి, కులవృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. గ్రామాల్లోని మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిన చెరువుల్లో నూరు శాతం ఉచితంగా చేప పిల్లలను అందించడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల, కులాల ఆర్థిభివృద్ధి కొరకు ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుందన్నారు. గ్రామాల్లో అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం గూడు లేని ప్రతి పేదవానికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి పేదవారి కలలను సాకారం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి సునావిూలో వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు గల్లంతవడం ఖాయమని సునీత అన్నారు. అభివృద్ధిని స్వాగతిస్తున్న వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. ఆలేరు అభివృద్ధి కోసం కేసీఆర్‌ ఆశీర్వాదంతో ముందుకు సాగుతున్నందున పలు గ్రామాల నుంచి వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. బంగారు తెలంగాణ టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. మహాకూటమి నాయకులు ప్రజలను మభ్య పెట్టడానికి దొంగ ప్రచారం విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఆలేరు ఎమ్మెల్యేగా తనను మరోమారు గెలిపించాలని అభ్యర్థి గొంగిడి సునీత కోరారు.