కులాల వారీగా ఓటర్లకు తాయిలాలు
డబ్బులతో ఎర వేస్తూ మభ్యపెట్టే యత్నాలు
దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలి
హుజూరాబాద్‌లో డిమాండ్ చేసిన ఈటెల
హుజూరబాద్,సెప్టెంబర్23 (జనంసాక్షి) : హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ పైసల రాజకీయం చేస్తోందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ప్రలోభాలు, బెదిరింపులతో ఓటర్లను లోబర్చుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఏ కులఆన్‌ఇన వదిలిపెట్టకుండా పథకాలు అమలు చేస్తూ జీవోలు విడుదల చేశారని ఆరోపించారు. ఆ పార్టీ వాళ్లు సొంత పార్టీ వాళ్లనే కొనుక్కుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. హుజురాబాద్ మధవాణి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విూడియాతో మాట్లాడారు. ’ప్రతిపక్షాల వాళ్లను బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారు. మంత్రులే లిక్కర్ లోడ్ తీసుకొచ్చి పంచుతున్నారు. కులాల వారీగా డబ్బులు పంచుతున్నారు. కుల సంఘాల పేరుతో రాజకీయం చేస్తున్నారు. కుల సంఘాలకు గుడులు కట్టిస్తామంటూ లోబరచుకుంటున్నారు. కుల సంఘాల విూద ప్రేమతో డబ్బులు ఇస్తామనడంలేదు. ఓట్ల కోసమే ఇదంతా చేస్తున్నారు. దళితుల విూద ప్రేముంటే.. ఏడున్నరేండ్లతో ఒక్క పథకం కూడా ఎందుకు తీసుకురాలేదు. కేసీఆర్ ఇప్పటికీ జైభీమ్ అని ఎందుకు అనడం లేదు. దళితబంధు కేవలం హుజురాబాద్‌లోనే కాకుండా.. రాష్ట్రమంతా ఇవ్వాలని ఈటెల డిమాండ్ చేశారు.. విూకు ఏవేవో ఇస్తామని చెప్పి.. ఈటల రాజేందర్‌ను బొంద పెట్టాలని చూస్తున్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే విూరిచ్చిన హావిూలెన్నో అమలు కావడంలేదు. అవన్నీ అమలుచేయాలి. ధనిక రాష్ట్రమని చెబుతున్నారు కదా.. మరి పెన్షన్లు, నిరుద్యోగ భృతి, చివరికి ఆరోగ్య శ్రీ డబ్బులు కూడా ఎందుకు విడుదలచేయడం లేదని ఈటల ప్రశ్నించారు.