కుల వ్యతిరేక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు బాపూలే.
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
జాతీయ బీసీ సంఘం సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి.
తాండూరు నవంబర్ 28(జనంసాక్షి)మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే ప్రపంచంలో మొట్టమొదటి కులనిర్మాణ కోసం పోరాడిన గొప్ప సంఘసంస్కర్త ఆయనని యావత్ బిసి సమాజం ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంగం కార్యదర్శి సయ్యద్ సుకూర్ మహిళా విభాగం అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి, మహిళా అధ్యక్షురాలు నాయి కోడి జ్యోతి, విజయలక్ష్మి తాండూరు నియోజకవర్గ మండల అధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, బసంత్, బాలు యాదవ్, మరియు సోషల్ మీడియా కన్వీనర్ బస్ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, మరియు బీసీ సంఘం సభ్యులు రాము ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, రమేష్ టైలర్, పరమేష్, నాయి బ్రాహ్మణ సమాజం సభ్యులు పరమేష్ నాయి బల రామ్ నాయి శ్రీనివాస్ నాయి అనిల్ నాయి ముదిరాజ్ సంఘం సభ్యులు అల్లాపూర్ శ్రీకాంత్ భాస్కర్ దుబాయ్ వెంకట్ రవి నరసింహ వెంకట్ రమేష్ మరియు బీసీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.