కూటమిలో ఉమ్మడి కార్యక్రమంపైనే చర్చించాం

సీట్ల సర్దుబాటుపై ఇంకా ప్రస్తావన లేదు: కోదండరామ్‌

సిద్దిపేట,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): నిరంకుశ పాలనను ఎలా అంతమొందించాలనే అంశంపైనే మహాకూటమిలో చర్చించామని టీజేఎస్‌ అధినేత కోదండరాం తెలిపారు. తమ కూటమి లక్ష్యం కూడా అదేనని అన్నారు. నిరంకుశ కుటుంబ పాలనపై యుద్దం చేస్తామని అన్నారు. అయితే తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై ఇంకా చర్చించలేదన్నారు. సీట్లకు సంబంధించిన చర్చ ఇంకా మొదలు కాలేదని చెప్పుకొచ్చారు. అయినా సీట్లపై పీటముడి పడిందన భావనలో ఒందరు చే/-తున్న ఆరోపణల్కలో నిజం లేదన్నారు. అసలా అంశమూ చర్చకు రాలేదన్నారు. అయితే బీజేపీతో కలిసే ఆలోచన లేదని కోదండరాం స్పష్టం చేశారు. తాము కూటమిలో చేరాక ఇక మరో ఆలోచనకు తావు లేదన్నారు. మరోవైపు మహాకూటమి వరుస సమావేశాలు జరుపనుంది. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ నేతలు చర్చలు జరుపనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.