కూటమి అభ్యర్థులకు డిపాజిట్లు రావు: నాయిని

 

నల్లగొండ,నవంబర్‌21(జ‌నంసాక్షి): మహకూటమి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. దేవరకొండ ప్రజా ఆశీర్వాద సభలో నాయిని మాట్లాడుతూ..డిండి ఎత్తిపోతలతో దేవరకొండ సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. రవీంద్రకుమార్‌ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు అడ్డుకున్నడు. కాంగ్రెస్‌, టీడీపీ ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతయో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాదు..ఉత్తమ్‌ గడ్డం తీయడని నాయిని ఎద్దేవా చేశారు. నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌ వంద సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.