కూటమి సీట్ల పంపకాలపై 8, 9 తేదీల్లో స్పష్టత

మిర్యాలగూడ కార్యకర్తల భేటీలో జానా వెల్లడి

కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ నేత

మిర్యాలగూడ సీటుపై జానాను నిలదీసిన కార్యకర్తలు

నల్లగొండ,నవంబర్‌3(జ‌నంసాక్షి): మహాకూటమిలో సీట్ల పంపకాలపై ఈనెల 8, 9 తేదీల్లో స్పష్టత వస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి తెలిపారు. శనివారం మిర్యాలగూడ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిర్యాలగూడ సీటును కాంగ్రెస్‌కు కేటాయించాలని కోరుతున్నామన్నారు. మాయమాటలతో ప్రజలను బురిడీ కొట్టించడం కేసీఆర్‌ ప్రత్యేకతన్నారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కాంగ్రెస్‌ పార్టీవే అని చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ ప్రాజెక్టును

పూర్తిచేయలేక పోయిందని జానారెడ్డి విమర్శించారు. ఇచ్చిన హావిూలను పూర్తి చేయకుండా 9 నెలల ముందే కాడి వదిలేసిన కేసిరా/-/-ను ప్రజలు వదిలేసేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఇదిలావుంటే

కార్యకర్తల సమావేశంలో జానారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఆయనకు నిరసన సెగ తగిలింది. మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక విషయమై పార్టీ ముఖ్య కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు శనివారం ఎంవీఆర్‌ ఫంక్షన్‌ హాలులో సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్టీలకే మిర్యాలగూడ సీటు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ జానారెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్‌పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడి ఉన్నవారికి కాకుండా స్థానికేతరులైన జానారెడ్డి తనయుడు రఘువీర్‌, ఇటీవల పార్టీలో చేరిన అమరేందర్‌ రెడ్డికి టికెట్‌ ఇస్తే ఉరుకునేది లేదని స్పష్టంచేశారు. తొలి నుంచీ కాంగ్రెస్‌లోనే పనిచేస్తున్న గిరిజన నేతలు స్కైలాబ్‌ నాయక్‌, శంకర్‌ నాయక్‌లకు టికెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. జానారెడ్డి ఎంత వారించినా శాంతించలేదు. కార్యకర్తల తీరుపై జానారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయన ప్రచార రథం ప్లెక్సీలు చించివేశారు. కార్యకర్తల నిరసనతో జానారెడ్డి సమావేశం నుంచి అర్థంతరంగా వెనుదిరిగారు.

 

 

తాజావార్తలు