‘కూడా ‘చైర్మన్ కలిసిన కాశీబుగ్గ దసరా ఉత్సవ కమిటీ
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 30(జనం సాక్షి)
కాశీబుగ్గ దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో” కూడా” చైర్మన్ సంగిరెడ్డి సుందర్ రాజు యాదవ్ ని కలిసి కాశిబుగ్గ దసరా ఉత్సవాలు చిన్న వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలకు మీ ద్వారా ఉత్సవాలు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఉత్సవ సమితి వారు మెమొరండం అందజేయడం జరిగింది. సంగిరెడ్డి సుందర్ రాజు యాదవ్ మాట్లాడుతూ కాశీబుగ్గ దసరా ఉత్సవాల కావలసిన ఏర్పాట్లన్నీ “కూడా” తో ఏర్పాటు చేస్తానని తెలిపినారు. కాశిబుగ్గ దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని దసరా ఉత్సవ కమిటీ వారు “కూడా” చైర్మన్ సంగిరెడ్డి సుందర్ రాజు యాదవ్ గారిని కోరినారు. ఈ కార్యక్రమంలోకాశీబుగ్గ దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు దూపం సంపత్. కన్వీనర్ బయ్య స్వామి. ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్. ఓనిభాస్కర్ గుల్లపల్లి రాజ్ కుమార్. గుత్తికొండ నవీన్. ఓం ప్రకాష్ కొలారియా.గోరంట్ల మనోహర్. మార్త ఆంజనేయులు. సిద్ధోజు శ్రీనివాస్.వేముల నాగరాజు. ములుక సురేష్. గణిపాక సుధాకర్.రాచర్ల శ్రీనివాస్. వలపదాసుగోపి. రామ యాదగిరి. ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area