కూతురుతో సహ తల్లి ఆత్మహత్యాయత్నం
వరంగల్: కొత్తగూడ మండలం రాజిరెడ్డిపల్లెలో కుటుంబకలహాలతో తల్లి, కూతుళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబసభ్యులు ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.