కూరగాయల రైతులకు ప్రోత్సాహం

సేంద్రియ సాగుకు సూచనలు

సిద్దిపేట,జూన్‌23(జ‌నం సాక్షి): కూరగాయలు పండించే రైతులకు తగిన గిట్టుబాటు ధర కల్పించేందుకుగాను కార్యాచణ ప్రణాళికను రూపొందించాలని ఉద్యాన అధికారులను ఆదేశించారు. కూరగాయలు పండ్లు పూలసాగుచేసే రైతులు, సంబందిత అధికారులను భాగస్వామ్యం చేస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహిం చాలని అధికారులను ఆదేశించారు. కూరగాయల రైతులకు మంత్రి హరీష్‌ రావు ప్రోత్సాహం అందిస్తున్నారు. సేంద్రియ పద్దతిలో సాగు చేయాలని సూచిస్తున్నారు. ఈ మేరకు అధికారులు కూడా రైతులను ప్రోత్సహిస్తున్నారు. యుఎస్‌డీపి, ఎఎస్‌ఐ సంస్థల సహకారంతో రైతుల ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ఇందుకోసం ప్రయోగాత్మకంగా కొన్ని ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లబించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, వర్గల్‌, సిద్దిపేట, మండలాల్లో కూరగాయలు పండించే రైతుల ఉత్పత్తులకు ఈ సంస్థ సహకారంతో అధికధర లబించేలా భాగస్వాములను చేయాలని నిర్ణయించామన్నారు. రైతులు పండించే కూరగాయలను గ్రేడింగ్‌ చేసి ప్యాకింగ్‌ చేసి మార్కెటింగ్‌ చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయం, హార్టికల్చర్‌ శాఖల అధికారులు కార్యాచరణను రూపొందించాలని సూచించారు. రైతులను ఈదిశగా ప్రోత్సాహం అందించేందుకు గాను తగిన శిక్షణ సూచనలు, సలహాలు అందించడం జరుగుతుందన్నారు.