కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా : ఒకరు మృతి

ఆత్మకూరు (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా ఆత్మకూరు-తిమ్మాపూర్ మధ్య జాతీయ రహదారిలో ఆదివారం ఉదయం ఆటో బోల్తా పడి ఒక మహిళ మృతిచెందింది. 15మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వేములకొండకు చెందిన కూలీలు పత్తి తీసేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందివేములకొండ గ్రామానికి చెందిన పద్మ(45) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్ సహా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదాన్ని చూసిన స్థానికులు 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.