కృషి వలయ ఫంక్షన్ హాల్లో పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి

 

 

 

 

 

ఏర్గట్ల జూలై 16 (జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని భట్టాపూర్ గ్రామంలోని కృషి వలయ ఫంక్షన్ హాల్ పై టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆకస్మిక దాడి చేసి పదిమంది పేకాట రాయుళ్లను పట్టుకొని ఏర్గట్ల పోలీస్ స్టేషన్లో సరెండర్ చేసినట్టు ఇన్స్పెక్టర్ వెంకటేశం తెలియజేశారు. వీరి వద్ద నుండి 9070/- రూపాయల నగదు,9 సెల్ ఫోన్లు ,నాలుగు బైకులు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు.