కృష్ణమ్మ ప్రవాహం ఒక మహాద్భుత జలదృశ్యం
కృష్ణా నీళ్ల కలశంతో ఊరేగింపు వెంకటేశ్వరస్వామి కి అభిషేకం
నేడు, రేపు గ్రామగ్రామాన దేవుళ్లకు కృష్ణానీటితో అభిషేకాలు
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,
వనపర్తి బ్యూరో సెప్టెంబర్17 (జనం సాక్షి)
కృష్ణమ్మ ప్రవాహం ఒక మహాద్భుత జలదృశ్యం మని, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు
కృష్ణా నీళ్ల కలశంతో ఊరేగింపు వెంకటేశ్వరస్వామి కి మంత్రి చేతుల మీదుగా అభిషేకం చేశారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ. సుభిక్ష తెలంగాణ ఆవిష్కరణ కేసీఆర్ లక్ష్యంమని,పాలమూరు ప్రజల చిరకాల కోరిక నేడు నెరవేరిందని చెప్పారు.
ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని,
భారతదేశ చిత్రపటంలో ఆకుపచ్చ తెలంగాణ శాశ్వత చిరునామాగా నిలుస్తుందని అన్నారు.
ఒకనాడు వెయ్యి అడుగులలోతు బోరు వేస్తే తాగునీటి కోసం కటకటలాడిన పరిస్థితి ఉండేదని,అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు.నేడు 300 అడుగుల భూగర్భంలో 60, 70 కిలోమీటర్ల సొరంగాలలో కృష్ణమ్మ ప్రవాహం ఒక మహాద్భుత జలదృశ్యం , అరుదయిన సంధర్భంమారిందని,
పాలమూరు రంగారెడ్డి మానవాద్బుత నిర్మాణం అని తెలిపారు.ఇది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణంగా ఉందన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో ఆరు జిల్లాలలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నదని,ఇచ్చిన మాట ప్రకారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేశామని తెలిపారు.నేడు, రేపు గ్రామగ్రామాన దేవుళ్లకు కృష్ణానీటితో అభిషేకాలు చేయాలని అన్నారు.కృష్ణా నీటిని ఒడిసిపట్టి పాలమూరు బీళ్లలో పారించాలన్న రైతుల కలలు నెరవేరుతున్న సంధర్భంగా నార్లాపూర్ నుండి కృష్ణా నీళ్లతో నింపి తీసుకువచ్చిన కలశంతో ఊరేగింపుగా వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి స్వామివారిని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభిషేకం చేశారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, నియోజకవర్గ సమన్వయకర్త వంగూరు ప్రమోద్ రెడ్డి, రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ సభ్యులు ఆవుల రమేష్ , బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.