కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ముందస్తు రాఖీ వేడుకలు

రుద్రంగి ఆగస్టు 11 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో గురువారం ముందస్తు రాఖి వేడుకల ను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ కు విద్యార్థినిలు వెళ్ళి ఎస్సై విజయ్,పోలీస్ సిబ్బందికి విద్యార్థులు రాఖీలు కట్టారు.అలాగే పాఠశాల లోని అందరి విద్యార్థులను రాఖీ పౌర్ణమి వేడుకల్లో భాగస్వామ్యం చేసి రాఖీలు కట్టించడం జరిగింది. మరియు విద్యార్థులు రాఖి ఆకారంలో కూర్చోని సంతోషాన్ని వ్యక్త పరిచారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్,ప్రిన్సిపాల్ హరినాథ్ రాజు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు