కృష్ణానీటితో చెరువులకు పుష్టి: ఎమ్మెల్యే చిట్టెం
మహబూబ్‌నగర్,జనవరి25(జనంసాక్షి): కృష్ణానది నీటితో చెరువులను నింపి చెరువు ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందించడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు.మక్తల్ పెద్ద చెరువు ఆయకట్టు కింద సాగు చేసిన వరి పంట చేతికి వచ్చేంత వరకు నీరు అందిస్తామని అన్నారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువ నుంచి మోటర్ల ద్వారా చెరువులోకి నీటి విడుదలను ఎమ్మెల్యే చిట్టెం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిజర్వాయర్‌కు నీటి విడుదల సమయంలో మక్తల్ చెరువుకు ప్రధాన కాలువ నుంచి నీటిని పూర్తి స్థాయిలో నింపడం జరిగిందని పేర్కొన్నారు. 10ఏళ్ల తర్వాత చెరువు నింపడంతో రైతులు ఆనందోత్సహంతో యసంగి పంటను పూర్తి స్థాయిలో సాగు చేస్తుండడంతో పంట చేతికి వచ్చేంత వరకు చెరువులో నీరందదనే ఉద్దెశంతో రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్‌లో మోటర్లను ఏర్పాటు చేసి నిరంతరం చెరువులోకి నీటిని విడుదల చేస్తున్నామన్నారు.బంగారు తెలంగాణ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణగా రూపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే అభివృద్ధిలో దేశంలోని అన్ని రాష్టాల్లో కెల్లా మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్టాన్న్రి అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొస్తున్నారన్నారు. నాయకుల వద్దకు, అధికారుల వద్దకు గతంలో లాగా పైరవీల కోసం ప్రజలు రావడం లేదన్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రధాన సమస్యలను పరిష్కరించి, మరిన్ని సమస్యలను పరిష్కరించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.