కెపాసిటీకి మించి ప్రయాణికులు పట్టించుకోని అధికారులు

ఇది ఎక్కడో పల్లెటూరు కాదు సాక్షాత్తు నేషనల్ హైవే 44 రహదారి పై వనపర్తి జిల్లా పెబ్బేరు నుండి అడ్డాకుల వరకు ప్రైవేటు గూడ్స్ వాహనాలలో జనాన్ని తరలిస్తున్న దృశ్యం గురువారం జనం సాక్షి కంటపడింది.
గూడ్స్ వాహనాలలో సరుకులు చేరవేసే బొలోరో లాంటి వాహనాలలో 30 నుండి 40 మంది దాకా కూలీలతో హైవేలో దర్శనమిస్తున్నాయి. హైవేలో ఇలాంటి వాహనంలో అదుపు చేయకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు గాలిలో కలుస్తాయని, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగిన, సంఘటన జరిగినప్పుడే అధికారులు స్పందిస్తారని, మళ్లీ యధా విధంగా ప్రయాణికులను చేరవేసే గూడ్స్ వెహికల్ రోడ్లపై ఎక్కిన పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వీటిని అదుపు చేయాల్సిన ఆర్ టి ఓ, వనపర్తి జిల్లా పోలీస్ యంత్రాంగం విఫలమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా వనపర్తి జిల్లా పోలీసు అధికారులు, ఆర్. టి ఓ స్పందించి ఇలాంటి వాహనాలను అదుపు చేయకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తాయని జిల్లా ప్రజలనుకుంటున్నారు.