కెమికల్‌ ఫ్యాక్టరీలో లీకయిన విషవాయువు:నలుగురి మృతి

నల్గొండ:చౌటుప్పల్‌ మండలం మల్కాపురంలో విషాదం చోటు చేసుకుంది. కెమికల్‌ ఫ్యాక్టరీలో విషవాయువు లీకు కావడంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం.