కెసిఆర్‌పై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి
న్యూఢీల్లీ: నవంబర్ 8, (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు మహబూద్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెసు పార్టీ నేతలు గువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రభుత్వ విప్,సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గా రెడ్డి) న్యూఢీల్లీలో మీడియా సమావేశంలో కెసిఆర్ పై నిప్పులు చెరిగారు తెలంగాణ ప్రజలను మోసంచేస్తోంది కాంగ్రెసు పార్టీ కాదని కెసిఆరే అని ఆరోపించారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ సొంతగా నిర్ణయం తీసుకోలేదన్నారు భాగస్వామ్య క్షాలతో మాట్లాడకుండా ఎలా నిర్ణయం తీసుకుంటామన్నారు2009 ఎన్ని కల్లో మేనిఫెస్టోలో తాము తెలంగాణ ఇస్తామని పోందుపర్చనప్పటికి సోనియా గాంధీ తెలంగాణ పట్ల సానుకూలంగా ఉన్నారన్నారు తెలంగాణ ఇచ్చేందుకు అధిష్టానం ఆలోయిస్తోందన్నారు కోంతమంది తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు టిఆర్‌ఎస్‌కు ఏజెంట్లుగా మారారని విమర్చించారు. కెసిఆర్ తెలంగాణ కవాతుకు, రాకుండా తెలంగాణ కోసం చివరి ఊపిరి వరకు పోరాటం చేసిన కోండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే ఎందుకు రాలేదని ప్రశ్నించారు తమ పార్టీ కెసిఆర్‌ను ఢీల్లీకి పిలవలేదన్నారు టిఆర్‌ఎస్ పార్టీగా కాకుండా లిమిటెడ్ కంపెనీగా పని చేస్తోందన్నారు టిఆర్‌ఎస్ నేతలకు తెలంగాణ రావాలనే చిత్తశుద్ధి లేదన్నారు తెలంగాణ ప్రజలు కేసిఆర్ మోసపూరిత మాటలను అర్థం చేసుకోవాలనిసూచించారు. తెలంగాణను నష్టపరిచే ఉద్యమాలకు తామ వ్యతిరేకం అన్నారు కెసిఆర్‌ది తెలంగాణపై రెండు నాల్కల ధోరణి అన్నారు తెలంగాణ ఉద్యోగులను మోసం చేసింది తెరాసయే అన్నారు డెడ్ లైన్లు పెట్టి ప్రజలను కెసిఆర్ మభ్యపెట్టారని విమర్శించారు తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారని కెకె తెరాసకు వత్తాసు పలకడం శోచనీయం అన్నారు తెరాస ఓడ్రామాల పార్టీ అన్నారు తెలంగాణతో పాటు తనకు అభివృద్ధి కూడా ముఖ్యమన్నారు.రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి ఎలాంటి ఢోకా లేదన్నారు కొందరు స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారుతున్నారన్నారు ఎవరు వెళ్లినా పార్టీకి నష్టం లేదన్నారు కెసిఆర్ పల్లెబాటను కేవలం ఓట్లు సీట్ల కోసమే చేస్తున్నారని కోసం కాదన్నారు కెసిఆర్ నోటికి ఏది వస్తే అది మాట్లాడతారని విహనుమంత రావు మండిపడ్డారు రెచ్చగొట్టేలా మాట్లాడి ఆత్మహత్యలను ప్రోత్సహించవద్దన్నారు. తెలంగాణ కౌన్సిల్‌కు తాముఒప్పుకున్నా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్నారు.