కెసిఆర్ దక్షతకు వరుస విజయాలు
సర్వేలన్నీ పాలనా వైభవానికి నిదర్శనమన్న ఎంపి
ఆదిలాబాద్,నవంబర్1(జనంసాక్షి): దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలవనుందని, కెసిఆర్ దక్షతే ఇందుకు నిదర్శనమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్దికి ప్రపంచ దేశాలు స్పందిస్తున్న తీరే ఇందుకు కారణమన్నారు. సులువుగా వ్యాపారాన్ని నిర్వహించుకోవడంలో తెలంగానలో అనుకూల వాతావరణం ఉండడంతో పాటు, ముందంజలో ఉండడం గర్వకారణమని అన్నారు. సులభతర వాణిజ్యంలో తెలంగాణకు ప్రథమ స్థానం దక్కడం సామాన్య విషయం కాదన్నారు. సంక్షేమం,అభివృద్ది
మేళవించి పాలన సాగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టి, పరిశ్రమలశాఖ మంత్రి కెటిఆర్ పట్టుదలతో సులభ వాణిజ్య విధానంలో తెలంగాణకు దేశంలోనే నంబర్ వన్ ర్యాంకు లభించిందని అన్నారు. మొత్తం 340 రకాల వాణిజ్య సంస్కరణల్లో 324 సంస్కరణలను తెలంగాణ అమలు చేసిందని
అన్నారు. టీఎస్ ఐపాస్ అమలుతో అన్ని రాష్టాల్రకు ఆదర్శంగా నిలువడమేకాకుండా ఆచరణలోనూ తెలంగాణ తన సత్తా చాటుకుందన్నారు. రాష్ట్ర అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, అందుకే ఇటీవల వెల్లడైన ఓ సర్వేలో ముఖ్యమంత్రికి మొదటిస్థానం లభించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. స్వరాష్టాన్న్రి అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడానికి సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని, బంగారు తెలంగాణ దిశగా దూసుకుపోతున్నారని బుధవారం నాడిక్కడ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇలా ఎన్నో ప్రజామోద పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారని చెప్పారు.