కెసిఆర్ ముందస్తు సవాల్
గతంలో జరిగిన ఎన్నికలు వేరు.. ఇప్పుడు జరగబోయే ఎన్నికుల వేరు.. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో అంటే 2014 ఎన్నికల్లో సెంటిమెంట్ బలంగా ఉంది. ఆ ఎన్నికల్లో అందరూ తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకున్నారు. తెలంగాణ రాష్ట్రసమితి కూడా సెంటిమెంట్‌తో నెగ్గుకుని వచ్చింది. ఎన్నికలయ్యాక అనేకమంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్ గూటికి చేరారు. దాదాపు నాలుగేళ్లు గడచిపోయి, మరో పదినెలల కాం మాత్రమే ఉంది. ఈ దశలో కేంద్రంలోనూ,రాష్ట్రంలోనూ ముందస్తున్న ఎన్నికల మాటలు తరచూ విన వస్తున్నాయి. 2019 మే వరకు ఆగకుండా డిసెబర్లేదా జనవరిలో ఎన్నకిలకు వెళతారని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటీవల ఎపి సిఎం చంద్రబాబు కూడా ముందస్తుగానే ఎన్‌ఇనకలు రావచ్చని అన్యాపదేశంగా అన్నారు. అయినా సిద్దంగానే ఉన్నామని అన్నారు. ఈ దశలో తెలంగాణ సిఎం కెసిఆర్ ముందస్తు సవాల్ విసిరారు. కాంగ్రెస్, బిజెపిలు పదేపదే తమదే అధికారం అంటూ, తమకు ఇన్నిసీట్లు అన్నిసీట్లని లెక్కులు చెబుతున్నాయి. కాంగ్రెస్ అయితే ఇక అధికారంలోకి వ్చినట్లే భావిస్తోంది. వీరి ప్రకటనలకు ఓ రకంగా కెసిఆర్ దీటుగానే స్పందించారు. ఎట్లా గెలుస్తారో రండి చూపిస్తా. వందకు పైగా సీట్లు గెలుస్తాం అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేయడమే గాకుండా ఎన్నికలకు ముందుగా వెళ్లడానికి కూడా సిద్దమన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వందకుపైగా స్థానాల్లో గెలుస్తుందని.. ఏ సర్వే చూసినా ఇవే ఫలితాలు వెలువడుతున్నాయని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఓ రకంగా కాంగ్రెస్, బిజెపిలకు సవాల్ అంటిదే. ప్రజలకు తమ ప్రభుత్వ పాలనపై పూర్తి నమ్మకమున్నదని.. అవసరమైతే ప్రజల మధ్యకు ముందస్తుగానే పోదామని ఆయన స్పష్టంచేశారు. గెలిచే అన్ని స్థానాల్లో 40వేల నుంచి 60 వేల ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఇక సెంటిమెంట్ పని అయిపోయింది. ఇప్పుడంతా అభివృద్ది నినాదం గా సిఎం కెసిఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. పునర్నిర్మాణం ఇతర పార్టీలకు రాజకీయ మని, టీఆర్‌ఎస్ పార్టీకి మాత్రం అదొక టాస్క్ .. ఒక యజ్ఞం.. పవిత్రమైన కార్యక్రమమని తెలిపారు.ప్రతిపక్షం పదే పదే తప్పుడు ఆరోపణలు, దుష్పచ్రారాలు చేయకుండా ఎన్నికలకు పోదామా? విూ సంగతి మా సంగతి ప్రజలు తేలుస్తరని సవాల్ విసిరారు. అందుకు కారణాలు లేకపోలేదు. తెలంగాణలో అమల వుతన్న పథకాలకు సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అమలు చేసిన, అమలు చేస్తున్న పథకాల ద్వారా అభివృద్ది శరవేగంగా సాగుతోందన్న భరోసా కెసిఆర్‌లో ఉంది. రాష్ట్రంలో మానవీయ కోణంలో అన్ని పథకాలు ప్రవేశపెడుతున్నామని వివరించారు. వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో ఎటుచూసినా ఆకు పచ్చగానే కనబడుతుందని 2020 జూన్ కల్లా ఎటుపోయినా పచ్చని పంట పైరుతో తెలంగాణ వ్యవసాయ రంగం రూ.లక్ష కోట్ల విలువైన పంట దిగుబడిని సాధిస్తుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు తెలంగాణ ఉద్యమం చిల్లర మల్లర రాజకీయంగా కనపడ్తది. ఏదో మాములు రాజకీయంలాగా కనిపిస్తున్నది. స్వరాష్ట్రం లో ఏం చేసినా ప్రజల కోణంలోనే చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు రాజకీయాల కోసం, ఓట్ల కోసం పెట్టినవి కావని కేడా కుండబద్దలు కొట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పెడుతున్నవి తమాషా స్కీంలు కావు. పేదల బాధ నుంచి వచ్చిన పథకాలు. పేదలు ఎక్కడ ఉన్నా పేదలే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు అగ్రకులాల్లో ఉన్న పేదవారికి కూడా కల్యాణలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నాం. మానవీయకోణంలో ఆలోచించి పథకాలు రూపొందించాం. తెలంగాణ రాష్ట్రం పేద ప్రజల రాష్ట్రం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 85 శాతం మంది ఉన్నారు.. అగ్రవర్ణాల్లో ఐదు శాతంపేదలున్నారు. వీరందరు కలిస్తే 90 శాతం పేదలు ఉన్న రాష్ట్రం. కల్యాణలక్ష్మి అగ్రకుల పేదలకు కూడా ఇస్తున్నాం. ఇండ్లు లేనివారికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తాం. వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడంతోపాటుగా అన్ని వర్గాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నెల.. నెలన్నరలో నీటిని ఇవ్వబోతున్నాం. ఇలా పథకాలను పక్కాగా అమలు చేయడం,,వాటి ఫీడ్ బ్యాక్ రావడం వల్ల కెసిఆర్ ధీమాగా ఉన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం అంటున్నరు.. కేసీఆర్‌ను గద్దె దించడం ఏం లక్ష్యం? టీఆర్‌ఎస్ పార్టీ అహంకారంతో పనిచేయడం లేదు. ఇలా మౌళిక ప్రశ్నలను విపక్షాలు వేశారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా కెసిఆర్‌ను గద్దె దించుదామన్న లక్ష్యంతో పోతామనడం ఏంటన్నది సవాల్ చేశారు. నిజంగానే ఇది ఆలోచించదగ్గ విసయమే. రాష్ట్రంలో ఇప్పటికే మూడు నాలుగు సర్వేలు చేయించాం. మరో మూడు నాలుగు రోజుల్లో మరో సర్వే విడుదల చేస్తాం. ఏ సర్వే అయినా టీఆర్‌ఎస్‌కు వందకుపైగా స్థానాలు గెలుస్తామని చెప్తున్నది./ూష్ట్రం ఏర్పాటు చేసుకున్న ఆరునెలల్లో విద్యుత్ సమస్యను అధిగమించాం. దీంతో ట్రాన్స్‌ఫార్మర్, జనరేటర్ల కంపెనీలు, కాంగ్రెస్ పార్టీ దివాళా తీశాయి. రీ డిజైనింగ్ ఎందుకు చేసినమో అసెంబ్లీలో చూపించినప్పుడు కాంగ్రెస్ నేతలు బహిష్కరించారు. ఎందుకు బహిష్కరించారో వారికే తెలియాలి. రాష్ట్రంలో అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయి. వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి. ఏపీలో డవ్కిూలు తప్ప ఏం లేదు పని. కానీ ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నామని అదే తమ అసెట్ అన్న ధీమాలో కెసిఆర్ ఉన్నారు. మొత్తానికి కెసిఆర్ సవాల్ ఇప్పుడు ముందస్తు ఎన్నికలకా లేక కాంగ్రెస్,బిజెపిలకా అన్నది పక్కన పెడితే దేనికైనా రెడి అన్నట్లుగా ఉంది.