కెసిఆర్, ఎమ్మెల్యేను విమర్శిస్తే తగిన గుణపాఠం చెపుతాం…

శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 5
బిజెపి నేత మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ కు రాజకీయ భిక్ష పెట్టింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన ముఖ్యమంత్రి పై ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు శంకరపట్నం జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్ చెప్పారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పిటిసి, పార్టీ అధ్యక్షుడు మాట్లాడారు. బిజెపి నాయకుడు మాజీ ఎమ్మెల్సీ కపిలవా యి దిలీప్ కుమార్ శంకరపట్నం మండలంలో ఈనెల 4న నిర్వహించిన బిజెపి ప్రజా గోషా యాత్రలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ పై, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో మరెక్కడ లేని విధంగా పేద బడుగు బలహీన వర్గాలకు కులవృత్తుల వారికి వృద్ధులకు వికలాంగులకు రైతులకు యువకులకు విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిధులు విడుదల చేస్తున్నారని, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గత పాలకుల కంటే నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధిని చూసి బిజెపి నాయకుల మతిభ్రమించి ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అనుచిత వ్యాఖ్యలను మానుకోవాలని హితవు పలికారు. లేకుంటే టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పులికోట రమేష్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పెద్ది శ్రీనివాసరెడ్డి, సర్పంచులు కొండ్ర రాజయ్య, సంపత్, రంజిత్ రావ్, నాయకులు కోటిలింగం, సతీష్ రెడ్డి, సంపత్, నాగయ్య, తిరుపతిరెడ్డి, కుమార్, శ్రీకాంత్ , టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.