కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలక్షన్ల సందర్భంగా ప్రచారానికి వెళ్లిన ఈటల రాజేందర్ పై టిఆర్ఎస్ కార్యకర్తలు వేసిన దాడి కి నిరసనగా కేశవ నగర్ చౌరస్తా లో బిజెపి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ప్రజాదరణను చూసి ఓర్వలేక టిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకుల పై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దాడి చేసిన టిఆర్ఎస్ నాయకుల పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని,ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో వికే మహేష్, శ్రీనివాస్ ముదిరాజ్,ఆర్ కే శ్రీనివాస్,బాల్ లింగం,ప్రసన్న,రామకృష్ణ,నరహరి, బాలచందర్ గౌడ్,సోమ శ్రీనివాస్,ఆనంద్, మంగేష్,చందు,రాకేష్,సత్యనారాయణ బాబు, సంతోష్, తుపాకుల జనార్ధన్, హర్ష తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు