కెసిఆర్ ప్రభుత్వంలో చర్చిలకు ప్రత్యేక గుర్తింపు

అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
రేగోడు (జనం సాక్షి )నవంబర్:
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం లోనే చర్చిలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు మంజీరవుతున్నాయని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని చర్చిలో పాస్టర్ల సమావేశానికి హాజరైన సందర్భంగా వారు మాట్లాడారు. నియోజకవర్గంలోని పాస్టర్ లందరికీ అందోల్ నియోజకవర్గం పాస్టర్ల అధ్యక్షుడు రే వ బి విజయకుమార్ రూపాయలు 599 తో 10 లక్షల ప్రమాద ఇన్సూరెన్స్ ను సంబంధిత పోస్ట్ ఆఫీస్ లో చెల్లించగా పాస్టర్ లందరికీ ఎమ్మెల్యే చేతుల మీదుగా సంబంధిత ఇన్సూరెన్స్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబంధిత చర్చిలకు అవసరమైన నిధుల వివరాలను ప్రతిపాదనలు పంపాలని అందుకు అవసరమయ్యే నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు అయ్యేందుకు తను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండ పాస్టర్ కుటుంబీలకు అనారోగ్యాలకు గురైతే ప్రభుత్వం ద్వారా ఎల్వోసి అందజేసేందుకు కృషి చేస్తానని ,సీఎం ఆర్ ఎఫ్ నుండి సహాయం అందజేసే చేసేవిధంగా చేస్తానని అన్నారు. సర్పంచ్ నర్సింలు, ఎంపిటి సి నర్సింలు, ప్రధాన కార్యదర్శి సుంకే రమేష్,పిఎసియస్ ఛైర్మన్ బాస్క రాజు,మాజీ కోఆప్షన్ మొయిజ్, నాయకులు బాలయ్య,సుభాష్,నర్సింగ్ రావు,హనుమంతు,బాబా,కృష్ణ,సురేందర్,హమీద్ తదితరులు ఉన్నారు.

తాజావార్తలు