కెసిఆర్ బూటకపు మాటలను ప్రజలు నమ్మరు.
ఆవాస్ యోజన పథకం ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుతీసుకోవాలి.
బిజెపి నాయకులు కొండ మన్నెమ్మ నాగేష్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్ 29(జనంసాక్షి):
ఇల్లు లేని పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బూటకపు మాటలతో ప్రజలను మోసం చేశారని,కానీ ఇప్పుడు మాత్రం ఆ బూటకపు మాటలను ప్రజలు నమ్మరని నాగర్ కర్నూల్ నియోజకవర్గం నాయకులు కొండ మణెమ్మ నాగేష్ అన్నారు.బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం చేగుంట గ్రామంలో గొల్ల సంజన కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్ల సంజన ఇల్లు మూడు సంవత్సరాల క్రితం కూలిపోయిందని,సంజన కాలు విరిగి,సొంత ఇల్లు లేక రోడ్డు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ ర్నూల్ నియోజక వర్గంలో ఇప్పటికీ ఒక్క డబల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తయిన దాఖలాలు లేవని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆవాస్ యోజన పథకం సొంతంగా ఇంటి స్థలం ఉన్నవారికి వారి స్థలంలోనే ఇల్లు నిర్మించుకోవడానికి రెండు లక్షల రూపాయలు మంజూరు చేస్తుందని ఈ పథకం ద్వారా స్థలం ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.ఆవాస్ యోజన పథకం ను తెలంగాణలో డబల్ బెడ్ రూమ్ స్కీం లో మిలితం చేసి డబల్ బెడ్ రూమ్ ఇస్తున్నామని అంటున్నారని, కానీ ఇప్పటివరకు నాగర్ ర్నూల్ నియోజకవర్గం లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.ఇకనైనా ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేయాలని లేకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆవాస్ యోజన పథకం ద్వారానైనా ప్రజలకు లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు గోసుల ఉమా బిజెపి నాయకులు గోసుల బాలయ్య గ్రామ బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు