కేంద్రం నమ్మించి ఎపిని మోసం చేసింది

న్యాయం చేస్తారనే ఆశించి ఎన్డీయేలో భాగస్వాములయ్యాం

ఎపికి విబజనతో అన్యాయం జరిగింది

అందుకే నవనిర్మాణ దీక్షలు చేస్తున్నాం

అమలాపురం నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు

అమలాపురం,జూన్‌5(జనం సాక్షి ): ఎపికి న్యాయం చేయడంలో కేంద్రం నమ్మించి మోసం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు మండిపడ్డారు. /ూష్ట్రానికి న్యాయం చేస్తారనే ఆశించి ఎన్డీయేలో భాగస్వాములయ్యామని, ఎన్నిలకంటే ముందే పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ ఇంతలా మోసం చేస్తారని గ్రహించలేక పోయామని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అన్ని రాష్ట్రాల మాదిరిగా ఏపీలో పండుగ చేసుకునే పరిస్థితిలో లేమని.. అందుకే ఆ రోజున నవనిర్మాణ దీక్ష చేసి, అందరం అంకితమైన భావంతో పనిచేయాలని ముందుకు పోయామని చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం అమలాపురంలో నవనిర్మాణ దీక్ష సభలో సీఎం మాట్లాడుతూ చాలా మంది దీక్షలు చేస్తారని.. భవానీ, అయ్యప్ప, వెంకటేశ్వర, శివ దీక్షలు చేస్తారని, ముస్లింలు రంజాన్‌ దీక్షలు చేస్తారని, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం జరుపుకునే ఏకైక దీక్ష… నవనిర్మాణ దీక్ష అని అన్నారు. ఇది ఐదు కోట్ల మంది ప్రజల కోసం చేసే దీక్ష అని ఆయన అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ప్రజలు గుణపాఠం చెప్పారని సీఎం అన్నారు. నాలుగేళ్ల కిందట పెట్టుకున్న నవనిర్మాణ దీక్ష అప్పటి.. ఇప్పటికి ఉపయోగపడిందని ఆయన అన్నారు. అందరం కష్టపడి రాష్ట్రాన్ని భారత దేశంలో నెంబర్‌ 1 రాష్ట్రంగా తయారు చేద్దామని సీఎం పిలుపు ఇచ్చారు. అప్పుడు చెప్పిన మాటే ఇప్పుడూ చెబుతున్నానని ఆయన అన్నారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించాలి.. ఇది వాళ్ల బాధ్యత అని, కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా ముందుకు వెళతామే తప్ప వెనక్కిపోయే సమస్యే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రి ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హెలికాప్టర్‌లో అమలాపురం చేరుకున్న చంద్రబాబుకు జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు అక్కడి నుంచి నల్లవంతెన వద్దకు చేరుకున్నారు. నల్లవంతెన నుంచి ఎర్రవంతెన వరకు సుమారు రూ.11కోట్ల వ్యయంతో నిర్మించిన ఓఎన్జీసీ రిటైనింగ్‌ వాల్‌ను ప్రారంభించారు. అనంతరం సవిూపంలోని ఏర్పాటుచేసిన ఎన్టీఆర్‌, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ విగ్రహాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత నూతనంగా నిర్మించిన నిర్మించిన సమనస గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. రంగాపురంలోని పురాతన శివాలయంలో నిర్వహించిన ¬మంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ ఆధ్వర్యంలో సుమారు 1500 మంది పోలీసులు అమలాపురంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటించే అన్ని ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి కార్యక్రమం వద్ద డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.