కేంద్రం నిధుల విడుదలతోనే అభివృద్ధి

అయినా విమర్శలు చేయడం తగదు
నిజామాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి )  : కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా ఇవ్వడం లేదన్న రీతిలో బిఆర్‌ఎస్‌ నేతలు ప్రకటనలు చేయడం సరికాదని బిజెపి జిల్లా నియకుడు పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. కేంద్రం నిధులు ఇవ్వనిదే తెలంగాణ అభివృద్ధి ఎక్కడ సాధ్యమయ్యేదని ఆయన అన్నారు. మోదీ సర్కారు తెలంగాణ అభివృద్ధిని విస్మరించలేదన్నారు. కేంద్రం వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో రెండు జాతీయ రహదారులను గుర్తించినందుకు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో రామగుండంలో రూ.6 వేల కోట్లతో విద్యుత్‌ ప్లాంటు నిర్మిస్తున్నామన్నారు.
ఐటీ, ఫార్మారంగాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. వివిధ మంత్రిత్వ శాఖల నుంచి రూ.వేల కోట్లు మంజూరు అవుతున్నాయని వివరించారు. పెద్దపల్లి`నిజామాబాద్‌కు రైల్వే మార్గానికి నిధులు కేటాయించారన్నారు.