కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం :కోదండరాం

కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్‌గా ఉద్యమం

మంత్రుల నియోజకవర్గల్లో పాదయాత్రలు

టీఆర్‌ఎస్‌తో  కలిసి ద్యమాన్ని ఉద్థృతం చేస్తాం

మెదక్‌: తెలంగాణ మంత్రులపై ఒత్తిడి పెంచేందుకు వారి నియోజకవర్గాల్లో త్వరలో ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర చేయబోతున్నట్లు తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించని తెలంగాణ ప్రాంత మంత్రులు, మోసం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్‌గా ఉద్యమం సాగుతుందని కోదండరాం అన్నారు. జహిరాబాద్‌లో జరిగిన విద్యార్థి జేఏసీ  ‘ఆత్మ గౌరవ పాదయాత్ర’ ముగింపు సభలో  ప్రొ. కోదండరాం మాట్లాడారు. మంత్రుల నియోజకవర్గల్లో పాదయాత్రలు చేస్తామని ఆయన వెల్లడించారు. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కోదండరాం హెచ్చరించారు. త్వరలోనే తెలంగాణ ఉద్యమ మలిదశ   కార్యచరణను ప్రకటిస్తామని ఈ సందర్భంగా కోదండరాం వెల్లడించారు. టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని, టీఆర్‌ఎస్‌తో  కలిసి ద్యమాన్ని ఉద్థృతం చేస్తామని ఆయన తెలిపారు. ఉద్యమ కార్యచరణను త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యాలు సంతృప్తికరంగా లేవని కోదండరాం వ్యాఖ్యానించారు.