కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వంట గ్యాస్ ధరలు తగ్గించాలి
మంచిర్యాల జిల్లా బిఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఎం.వి.గుణ……..కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గ్యాస్ ధర తగ్గించాలని, పెంచిన గ్యాస్ ధరలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైనే అధిక భారం పడుతుందని, బిఆరెఎస్ ప్రభుత్వం గ్యాస్ కు చెల్లించాల్సిన ధరలో రూ.291/- వసూలు చేస్తూ కేంద్రం గ్యాస్ ధర పెంచిందని రోడ్డెక్కడం విడ్డూరంగా ఉందని, హిందూ మతం పేరుతో రాజకీయం చేసే బిజేపి దేశంలో ఎనభై శాతం ఉన్న హిందువులపై గ్యాస్ భారం మోపుతుందని, మీరిచ్చే ఉచిత బియ్యం వండుకుని తినాలంటే దాదాపు రూ. 1200/- లతో గ్యాస్ కొనుక్కోవాలని, ఇది దేశ ప్రజల రక్తం తాగడమేనని, ఇప్పటికైనా ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ ధరలు తగ్గించాలని లేకపోతే వచ్చే ఎలక్షన్స్ లో తగిన పర్యవసానలు ఎదుర్కొంటారని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఎస్పీ జోనల్ మహిళా కన్వీనర్ భవానీ, జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డు వినోద, జిల్లా సీనియర్ నాయకులు సారయ్య, కనుకుంట్ల విజయ్, ప్రేమ్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు………..జనం సాక్షి