కేంద్రానికి మంత్రి పోన్నాల లేఖలు
హైదరాబాద్: భారత్ అమెరికా వ్యాపార ఇప్పందాలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిబంధనలు సడలించేందుకు అమెరికాపై ఒత్తిడి తేవాలని రాష్ట్రమంత్రి పొన్నాల కేంద్రానికి లేఖ రాశారు. అమెరికా వీసా ఛార్జీలు పెంచటం ద్వారా అక్కడికి వెళ్లే ఐటీ నిపుణులకు ఇబ్బందిగా మారిందని పొన్నాల తన లేఖలో పేర్కొన్నారు. పెంచిన అమెరికా వీసా ఛార్జీలను తగ్గించటంతోపాటు ఆ దేశానికి వెళ్లే ఔట్ సోర్సింగ్ ఐటీ నిపుణులకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.