కేంద్రీయ విద్యాలయంలో చైల్డ్ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు.
రాజన్నసిరిసిల్లబ్యూరో. సెప్టెంబర్ 13. (జనం సాక్షి) సిరిసిల్ల పట్టణంలో లోని కేంద్రీయ విద్యాలయంలో చైల్డ్ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ సేవలపై మంగళవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ త్రివేణి మాట్లాడుతూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. సమస్యలు ఎదురైనప్పుడు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు తెలియజేయాలని సూచించారు. హెల్ప్ లైన్ అందిస్తున్న సేవలను తెలియజేశారు. కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ,ఉపాధ్యాయులు చైల్డ్ హెల్ప్ లైన్ టీం సభ్యులు శ్రావణ్ విద్యార్థులు పాల్గొన్నారు.