కేంద్రీయ విద్యాలయం మంజూరుపై హర్షం

కెసిఆర్‌,హరీష్‌ల పటాలకు పాలాభిషేకం

సిద్దిపేట,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): నంగునూర్‌ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి సర్కిల్‌ వద్ద టిఆర్‌ఎస్‌వి ఆధ్వర్యంలో… సీఎం కేసీఆర్‌, మంత్రివహరిశ్‌ రావు,పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్‌ రెడ్డిల చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు భూక్య భిక్షపతి నాయక్‌, నియోజకవర్గ నేత నార్లాపురం రాంమోహన్‌,గజ్వెల్లి బాలకిషన్‌లతో కలసి మాట్లాడుతూ…దేశంలో 13 కేంద్రీయ విద్యాలయాలు కేంద్రం మంజూరు చేయగా అందులో సిద్దిపేటకు మంజూరు చేయించారు. పేద విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయం ద్వారా సిద్దిపేట ప్రాంత చెందిన 1000 మంది విద్యార్థులకు సెంట్రల్‌ సిలబస్‌ తో కూడిన నాణ్యమైన విద్య అందనుందని వివరించారు. సిద్దిపేటను అభివృద్ధి లో ముందుంచిన మంత్రి హరీష్‌ రావు కు నంగునూర్‌ మండలం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్‌, ఉపాధ్యక్షుడు పెంబర్ల రమేష్‌ యాదవ్‌, మండల కార్యదర్శి ఆకారం రాజేందర్‌, నంగునూర్‌ టౌన్‌ అధ్యక్షుడు సంపత్‌ యాదవ్‌, అనిల్‌ రెడ్డి, ఆంజనేయులు, రాజశేఖర్‌, రవికాంత్‌, శ్రీనాథ్‌,యాదగిరి, కిరణ్‌, పర్శరములు,నవీన్‌,మహేష్‌,సురేష్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు..