కేంద్ర పథకాలపై బిజెపి ప్రచారం
మెదక్,జూన్26(జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించేందుకు బిజెపి కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి అన్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలనలో ప్రజాసంక్షేమ పథకాలను అవలంబించి మంచి పాలన అందిస్తున్నారని అన్నారు.ప్రధాని మోడీ నేతృత్వంలో ఏన్డీఏ ప్రభుత్వం 4సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ప్రజలకు సుపరిపాలన, పారదర్శకతకు పెద్దపీట వేశారన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అనే నినాధంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా ప్రధాని ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన, దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన, ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి భీమా యోజన, అటల్ పింఛన్ యోజన, సుకన్య సమృద్ధి యో జన, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, ప్రధాని ము ధ్రా యోజన, స్వచ్ఛభారత్ అభియాన్, బేటీ బచావో-బేటీ పడావో, ప్రధాని ఆవాస్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, జన్‌ధన్ యోజన పథకాలను ప్రజలకు అందిస్తున్నారన్నారు.