కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం

-ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): సీపీఎస్‌ రద్దుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్న సీసీఈ విధానాన్ని వెంటనే రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. పీఆర్‌టీయూ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు విద్య, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కృషి చేసిందన్నారు. ఎటువంటి సమస్యలు వచ్చినా సామరస్య వాతావరణంలో పరిష్కరించుకొని సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి సభ్యులందరూ సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి సంఘం సభ్యులను, నాయకులను కోరారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కేంద్ర పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఎమ్మెల్సీ వివరించారు. సీపీఎస్‌ రద్దు అయితే ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇస్తారన్నారు. ఇందుకోసం మన ఎంపీల సహకారంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఢిల్లీలో ఎంపీ జితేందర్‌రెడ్డి సమస్యల పరిష్కారం కోసం వెళ్లిన వారందరికి సదుపాయాలను కల్పించడంతోపాటు కేంద్ర మంత్రులు, అధికారులను కల్పించి సమస్యలను కొలిక్కి తీసుకురావడానికి అందిస్తున్న సహాయ సహకారాలు మరువరానివన్నారు. ఎ నేతలందరూ సమస్యల పరిష్కారం కోసం ఎప్పిటికప్పుడు సహకరిస్తున్నారన్నారు.