కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న అగ్ని పథ్ స్కీమ్ ను పునర్ సమీక్షించాలి

  తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్
నాగర్ కర్నూల్ బ్యూరో జూన్ 18 (జనంసాక్షి)
 ఈరోజు దేశంలో ఎంతో మంది యువతకు ఉద్యోగా, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగుల మిగిలి పోతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధాని, కేంద్ర రక్షణ శాఖ, బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ  నాయకత్వంలో అగ్ని పథ్ అని దేశ రక్షణ విభాగంలో 17.6 సంవత్సరాల వయస్సు వారి నుండి 21.6 సంవత్సరాలు  కల్గిన యువతను అగ్నిపథ్ అనే నూతన విధానంలో చేర్చుకోవాలని చేస్తున్నా ప్రయత్నం దేశ రక్షణకే భంగం కలిగించేల ఉందని దారమోని గణేష్ అన్నారు. ఈరోజుల్లో యువత దేశ రక్షణ కోసం దేశ ఆర్మీ, నావి, వాయు సేన  విభాగాల్లో  చేరి దేశం కోసం సేవ చేయాలి అనుకునే నిరుద్యోగ యువతకు తీవ్ర నిరాశ కలిగించిందని, ఇది కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు  నిదర్శనమని ఒకపుడు దేశంలో జై జవాన్ జై కిసాన్ అనే వాళ్ళము అని ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తేవడం మొదలు ఈరోజు దేశ రక్షణ విషంలో కూడ తీవ్ర అన్యాయం చేయాలని, అగ్నిపత్ స్కీమ్ దేశంలో యువతకు నిరాశ కలిగించిందని నాలుగు సంవత్సరాలు సైన్యంలో పని చేసిన తర్వాత అందులో 25% శాతం మందికి మాత్రమే నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయాలనే నిబంధన తీసుకురావాలని రక్షణ విభాగం కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని దేశంలోని యువతకు దేశభక్తి పెంపొదెల  దేశ ప్రధాని నరేంద్ర మోడీ  వ్యవహరించాలని అగ్ని పథ్ విషయాన్ని పునర్ సమీక్షించుకోవాలని తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ కోరారు.