కేంద్ర బడ్జెట్ జనవరిలోనే ….

Jaitley_suitcaseసరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది కేంద్రం. ఏళ్లుగా సాగుతున్న చరిత్రను కొత్త మలుపుతిప్పే ప్రయత్నం చేస్తోంది. ఏటా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్ ను జనవరిలోనే ప్రవేశ పెట్టేందుకు రెడీ అవుతోంది. ఫిబ్రవరి నెలలో చివరి పనిదినాన ప్రవేశపెడుతూ వస్తున్న కేంద్ర సాధారణ బడ్జెట్టును నెల రోజులు ముందుకు జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. జనవరి నెలాఖరునే ఈ పనిని పూర్తి చేసి, బడ్జెట్‌ ఆమోదంతో సహా మొత్తం ప్రక్రియను కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యేలోపు ముగించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ ఏడాది నుంచి బడ్జెట్లో సమూల మార్పులు చేయడానికి ఆర్థిక శాఖ అన్ని విధాలా సమాయత్తమవుతోంది. మరో విశేషం ఏంటంటే..  గత 92 ఏళ్లుగా విడిగా ఉన్న రైల్వే బడ్జెట్టునూ సాధారణ బడ్జెట్లోనే కలిపేయడం, బడ్జెట్‌ పుస్తకం పరిమాణాన్ని తగ్గించడంతో పాటు దీనిని ప్రవేశపెట్టే తేదీనీ మార్చనున్నారు. నిజానికి బడ్జెట్ ను నిర్దుష్టంగా ఫలానా తేదీన ప్రవేశపెట్టాల్సిందిగా రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఫిబ్రవరి నెలాఖరున ప్రవేశపెట్టడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే దీన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది మోడీ సర్కార్.