కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌తో సీఎం సమావేశం
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినలో బిజిబిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్ర సమస్యలపై చర్చిస్తున్నారు. ఇవాళ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌తో సీఎం సమావేశమయ్యారు. సమావేశంలో వాటర్‌గ్రిడ్, రోడ్ల అభివృద్ధిపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో సీఎం సమావేశం కానున్నారు.