కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
మద్దూరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్దికి ప్రత్యేకంగా విద్యాహక్కు చట్టాన్ని రూపోందించినా. అమలు అస్తవ్యస్తంగా తయారైందిని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్. కిష్టయ్య వెళ్లడించారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అయన మద్దూరు మండలంలో సోమవారం పర్యటించారు. విలేకరులతో మాట్లాడూతూ… కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి అభివృద్దికి కృషి చేయాలని అయన కొరారు. ఉపాధ్యాయ సంఘాలు సమస్యలపై పోరాటం చేయాలని, నేడు అనేక సంఘాలు కోందరి స్వార్ధం కోసం తప్పుడు మార్గంలో ఉన్న ఉపాధ్యాయులను రక్షించే పని చేస్తున్నాయని కిష్టయ్య విమర్శించారు. ఎంఈవోల పేరు ఎంపీ ఈవొలుగా మార్చి అడహక్ సర్వీస్ రూల్స్ రూపోందించి పదోన్నతులు బదీలీలు జరపాలని డిమాండ్‌చేశారు ఉపాద్యాయ సమస్యలపై ఈ నేల 25న జరిగే ఎంఈవో నిర్వాకం వల్ల విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, ఉన్నతాదికారులు అయననుఇక్కడ నుంచి మార్చాలని డిమాండ్ చేశారు.