కేంద్ర వివక్షపై గళం విప్పే దమ్ముందా?
– కిషన్ రెడ్డి టీఆర్‌ఎస్ ఎంపీ కవిత సూటి ప్రశ్న
హైదరాబాద్:
కేంద్ర వివక్షపై గళం విప్పే దమ్ము కిషన్‌రెడ్డికి ఉందాని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత సూటిగా ప్రశ్నించారు. ఆదివారం ఆమె తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం వరంగల్‌లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని కోరితే కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్రానికి ఆరువేల కిలోవిూటర్ల రహదారులు కేటాయించాలని అడిగితే కేవలం 12 వందల కిలోవిూటర్ల కేటాయించి దులిపేసుకున్నారని వివరించారు. ఎయిమ్స్ కావాలని అడిగితే అదే పరిస్థితి ఉందని తెలిపారు. ఇవన్నీ కిషన్‌రెడ్డికి కనిపించడం లేదా? అని నిలదీశారు. ఇంకా ఆయనే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో హౌజింగ్‌పై మమ్మల్ని నిలదీస్తానని ఇవాళ పేపర్‌లో వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కిషన్‌రెడ్డికి దమ్ముంటే మోదీని ప్రశ్నించాలని సవాలు విసిరారు. వాళ్లు పక్షపాతంగా ఉంటూ అభివృద్దిని అడ్డుకుంటూ మమ్మల్ని అభివృద్ధి చేయడంలేదని అంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రాకు కేంద్రం కేటాయిస్తున్న నిధులు కిషన్‌రెడ్డికి కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. ఈ వివక్ష గురించి కిషన్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ ¬దా తేవడంలో మాకెంత పాత్ర ఉందో కిషన్‌రెడ్డికి అంతే పాత్ర ఉందని వివరించారు. కేసీఆర్ కేంద్రాన్ని ఎన్ని కావాలని కోరినా చిన్నచిన్నవి ఇచ్చి మిగతావి పక్కన పెడుతోన్న విషయం ఆయనకు తెలియదా అని అన్నారు.తెలంగాణకు ఎయిమ్స్ కావాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను తీసుకెళ్లి ఢిల్లీలో మోదీని అడిగే దమ్ము, ధైర్యం కిషన్‌రెడ్డికి ఉందా? అని అడిగారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా మొత్తం కేంద్ర నిధులతోనే నిర్మించేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు.