కేజ్రీవాల్‌కు ఆధారాలెక్కడివి?

ముంబయి : ఐఎసి క్రియాశీలక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ చేస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయనకు సమాచారం ఎక్కడ నుంచి వచ్చిందో వెల్లడించాలని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఆర్‌.వైద్యనాథన్‌ కోరారు. ఆయన స్విస్‌ బ్యాంకులలో నల్లధనం గురుంచి 2011లో ఒక పరిశోధనా పత్రం సమర్పించారు. ఇందులో హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు గురించి సమాచారం కూడా ఉంది. ఈ వివరాలను ఎలా సంపాదించారో తెలుసుకోగోరుతున్నట్లు చెప్పారు. ఫ్రాన్స్‌ ఈ సమాచారం అందించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ ఇందులో ప్రముఖుల పేర్లు ఏవీ లేవని తనకు తెలిసినంతవరకు లేవన్నారు. భారత్‌ యూరోపియన్‌ యూనియన్‌ల మధ్య ఇందుకు సంబంధించి ఎలాంటి ఒప్పందం లేదన్నారు. కాగా హెచ్‌బీసీ గురించి తాము సంపాదించిన జాబితాలో అకౌంట్‌ నెంబర్లు ఏయే దేశాల్లో ఉన్నదీ మాత్రమే వెల్లడించారని కాని వ్యక్తుల పేర్లను వారి చిరునామాలు లేనేలేవన్నారు. దాచుకున్నా ఆ బ్యాంకు సీఈఓకే వివరాలు తెలుస్తాయని అలాంటి ఉన్నతాధికారి కేజ్రీవాల్‌కు వివరాలు ఇచ్చే సమస్య ఉత్పన్నం కాదన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే వాటికి విలువ ఉండదన్నారు.