కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆందోళనలు
న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఆయన మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. సంస్థద్ మార్గ్‌లో వికాలాంగులతో కలిసి పలు సేవా సంస్థల నిర్వాహకులు ధర్నా చేపట్టారు. స్వచ్ఛంద సంస్థలో నిధులు అవకతవకలకు పాల్పడ్డ కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిన్న ప్రధాని నివాసం ఆందోళనకు దిగిన కేజ్రీవాల్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే