కేజ్రీవాల్ ఆరోపణలపై విచారణ జరపాలి: వీకే సింగ్
ఢిల్లీ: అవినీతి విషయంలో పలువురు నేతలపై అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని మాజీ సైన్యాధ్యక్షుడు వీకే సింగ్ అన్నారు. తగిన సాక్ష్యాధారాలున్నందునే కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే తాను కేజ్రీవాల్ పెట్టబోయే రాజకీయ పార్టీలో చేరే విషయాన్ని ఆయన ఖండించారు. లోక్‌నాయక్ జయప్రకాశ్‌నారాయణ్ ఏ పార్టీలోనూ చేరి పనిచేయలేదని సింగ్ వ్యాఖ్యానించారు. తన భవిష్యత్ ప్రణాళిక గురించి త్వరలోనే తెలియజేస్తానని వీకే సింగ్ పేర్కొన్నారు.